- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోదీ మీటింగ్‌కి సీఎంలు డుమ్మా
దిశ, వెబ్‌డెస్క్: అన్ని రాష్ట్రాల సీఎంలతో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమావేశానికి పలువురు సీఎంలు డుమ్మా కొట్టారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, వ్యాక్సినేషన్ పంపిణీపై చర్చించేందుకు వర్చువల్ ద్వారా అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఛత్తీస్‌గఢ్ సీఎం, కాంగ్రెస్ నేత భూపేష్ బాగెల్ హాజరుకాలేదు.
మోదీ నిర్వహించిన ఈ కీలక సమావేశానికి ఇద్దరు సీఎంలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. అయితే ముందుగా ఫిక్స్ చేసుకున్న ఎన్నికల ప్రచార షెడ్యూల్ కారణంగా మోదీ సమావేశానికి మమత హాజరుకాలేదని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆమె తరపున బెంగాల్ చీఫ్ సెక్రటరీ హాజరయ్యారు.
మోదీ మీటింగ్‌కు మమత డుమ్మా కొట్టడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది జూన్‌లో అన్ని రాష్ట్రాల సీఎంలో మోదీ నిర్వహించిన సమావేశానికి కూడా మమత హాజరుకాలేదు. ఇక గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ సమావేశానికి కూడా మమత హాజరుకాలేదు.