వారిని ప్రభుత్వం ఆదుకోవాలి -నందిని విక్రమార్క

by Sridhar Babu |
వారిని ప్రభుత్వం ఆదుకోవాలి -నందిని విక్రమార్క
X

దిశ, మధిర: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మధిర మండలంలో పంట పొలాలు దెబ్బతిన్నాయి. దీంతో మండలంలోని చిలుకూరు, జలిముడి, రొంపిమల్ల, మల్లరం గ్రామాల్లో మధిర ఎమ్మెల్యే సతీమణి మల్లు నందిని విక్రమార్క పర్యటించారు.

దెబ్బతిన్న పంట పొలాలను ఆమె పరిశీలించారు. మధిర నియోజకవర్గం‌లో వరి, మిరప , పత్తి పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్ట పోయారని ఆమె తెలిపారు. వెంటనే పంటపొలాలను వ్యవసాయ అధికారులు పరిశీలించాలని కోరారు. నష్టపోయిన రైతులకు తక్షణమే నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

Next Story