ఆసుయంత్ర సృష్టికర్త మల్లేశానికి ఘన సన్మానం

by Shyam |
ఆసుయంత్ర సృష్టికర్త మల్లేశానికి ఘన సన్మానం
X

దిశ, భువనగిరి: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆసుయంత్ర సృష్టికర్త చింతకింది మల్లేశాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్య క్షుడు కొలుపుల అమరేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టిందన్నారు.

చేనేత వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసి.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి.. చేనేత కుటుంబాలకు అండగా ఉండాలన్నారు. చేనేత కార్మికులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన చింతకింది మల్లేశం మన జిల్లా బిడ్డ అయినందుకు గర్విస్తున్నా అని అమరేందర్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed