కొవిడ్-19 కొత్త యాప్ ప్రారంభం

by Anukaran |
కొవిడ్-19 కొత్త యాప్ ప్రారంభం
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కోవిడ్19 అనే కొత్త యాప్ ప్రారంభమైంది. శనివారం జిల్లా కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి మల్లరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్-19 కొత్త యాప్ మంత్రి ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ఒక పేషెంట్ తో వీడియో కాల్ లో మంత్రి మాట్లాడారు.

వైద్యులు అందిస్తున్న వైద్యం, ఇతర సేవలపై ఆరా తీశారు. కరోనా సమయంలో వైద్య అధికారులు చేస్తున్న సేవలను ప్రశంసించారు. తగిన జాగ్రత్తలు పాటించి కరోనా వ్యాధిని నిర్ములించవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు, జేసీ విద్యాసగర్, డీఎం హెచ్ వో వీరాంజనేయులు, వైద్య అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story