డంపింగ్ యార్డ్ వద్దంటూ ఆందోళన

by Sridhar Babu |
డంపింగ్ యార్డ్ వద్దంటూ ఆందోళన
X

దిశ, కరీంనగర్: డంపింగ్ యార్డు ఏర్పాటు చేయవద్దంటూ గ్రామస్థులు నిరసనకు దిగారు. చొప్పదండి మండలం మల్లన్నపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చొప్పదండి మున్సిపల్ అధికారులు మల్లన్నపేట గ్రామ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు గతంలో స్థల పరిశీలనకు వచ్చినప్పుడు కూడా గ్రామస్థులు అడ్డుకున్నారు. అయినా అధికారులు ప్రత్యామ్నాయ ప్రాంతానికి చెత్త తరలించకపోవడంతో సోమవారం గ్రామస్థులు చెత్తను తరలించే ట్రాక్టర్లను అడ్డుకున్నారు.

Advertisement

Next Story