సీఎం దత్తత మండలానికి మల్లారెడ్డి సొంత నిధులు..

by Shyam |
సీఎం దత్తత మండలానికి మల్లారెడ్డి సొంత నిధులు..
X

దిశ, శామీర్‌పేట్: ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడే అభివృద్ధి సాధ్యమని కార్మికశాఖ మంత్రి మల్లా రెడ్డి అన్నారు. సీఎం దత్తత మండలమైన మూడు చింతలపల్లిలోని గ్రామాలకు తన సొంత నిధులతో డెడ్ బాడీ ఫ్రీజర్లను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఫ్రీజర్లు గ్రామ పంచాయతీ వద్ద ఉంటాయని, గ్రామస్తులకు అవసరమైనప్పుడు తీసుకెళ్లాలని, ఎలాంటి నగదు చెల్లించనవసరం లేదని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని, రాష్ట్రంలోని ప్రతి గ్రామ అభివృద్ధి‌కి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story