- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్కాపూర్‌లో కనుచూపుమేర నీరే..
దిశ, తాండూర్ :
వికారాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తాండూరు మండలం మల్కాపూర్ గ్రామం నీటిలో మునిగిపోయింది. మల్కాపూర్ మొత్తం రాళ్ల గనులతో కూడుకుని ఉంటుంది. ఈ వర్షానికి చుట్టుపక్కల గనులన్నీ నీటితో నిండిపోవడంతో వరద కాస్త ఊర్లోకి వచ్చింది. దీంతో అక్కడి ఇళ్ళన్నీ నీటిలో మునిగిపోవడంతో పిల్లలు, వృద్ధులు, గ్రామస్తులందరూ ఇళ్ల పైకెక్కి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ గ్రామానికి శాశ్వత పరిష్కారం చూపించాలని బాధితులు కోరుతున్నారు. మల్కాపూర్‌లో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఏకంగా మనిషిలోతు వర్షపునీరు ఇళ్లలోకి చేరడంతో వస్తువులు, బట్టలు, ధాన్యం కూడా తడిచిపోయాలని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు జిల్లాలో కరోనా విజృంభిస్తుండగా, వర్షం వలన సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.