రూ.5 భోజన సదుపాయం కల్పించాలని వినతి

by Shyam |   ( Updated:2021-12-16 07:22:51.0  )
SRINIVAS REDDY
X

దిశ, నాచారం: మల్లాపూర్ డివిజన్ పరిధిలోని పేదలు అధికంగా నివసించే నెహ్రూ నగర్, అశోక్ నగర్, మర్రిగూడ ప్రాంతాల్లో రూ.5 భోజన సదుపాయం కల్పించాలని కార్పొరేటర్ కి విన్నవించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేట్ పన్నాల దేవేందర్ రెడ్డి కలిసి రూ. 5 రూపాయల భోజన సదుపాయం కల్పించాలని కోరారు. పేదలు, కూలి పనులు చేసే ప్రజలు ఉపాధి లేక జీవనోపాధికి ఇబ్బంది కరంగా మారిందని కార్పొరేటర్ దృష్టి కి తెచ్చారు. ఈ సమస్యకు సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి రూ.5 భోజన సదుపాయం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.

Advertisement

Next Story

Most Viewed