ఇక కండోమ్స్ తో పనిలేదు.. పురుషులకు కూడా గర్భ నిరోధక మాత్రలు

by Anukaran |   ( Updated:2021-08-06 02:43:26.0  )
ఇక కండోమ్స్ తో పనిలేదు.. పురుషులకు కూడా గర్భ నిరోధక మాత్రలు
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఇప్పుడే పిల్లలు వద్దు అనుకొనే జంటలకు, అవాంఛిత గర్భాలు రాకుండా ఉండడానికి జంటలు కండోమ్స్ ని ఉపయోగిస్తారు. ఇక వాటిని ఉపయోగించినప్పుడు మహిళలు గర్భ నిరోధక మాత్రలు వేసుకోని అవాంఛిత గర్భానికి చెక్ పెడుతుంటారు. అయితే కొన్ని సార్లు ఆడవారి శరీరంలో అండాలు విడుదలైనట్లే.. మగవారి వీర్యం కూడా ఎక్కువ విడుదలైనప్పుడు కండోమ్స్ వాడినా ప్రయోజనం అనేది ఉండదు. ఇక ఆడవారు గర్భ నిరోధక మాత్రలు వేసుకున్నప్పుడు అండాల తయారీ ఎలా ఆపుతుందో.. అలాగే మగవారికి వీర్య కణాలు ఉత్పత్తి కాకుండా ఉండేందుకు పురుషులకు కూడా గర్భ నిరోధక మాత్రలు తయారు చేస్తున్నారట.

నిజానికి కండోమ్ తర్వాత పురుషుల కోసం ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణ సాధనాలేవీ అందుబాటులోకి రాలేదన్న మాట విదితమే. కొన్నిసార్లు కండోమ్ వాడినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే కొన్నిసార్లు తాము శారీరకంగా కలవడానికి భయపడుతున్నామని మగవారు చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మగవారికి కూడా కుటుంబ నియంత్రణ మాత్రలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నట్టు స్కాట్లాండ్‌లోని దుండీ యూనివర్సిటీ శాస్త్రవేత్త క్రిస్ బారాట్ తెలిపారు. కేవలం శారీరక సుఖం కోసం కలయిక కోరుకునే జంటల కోసం ఈ ట్యాబ్లెట్లను అందుబాటులోకి తేనున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ డుండీ(స్కాట్లాండ్‌) ప్రకటించింది.

ఇక ఈ ప్రయోగాన్ని దగ్గరుండి ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఈ ప్రయోగాన్ని చేయించడం విశేషం. ఇందుకోసం ఫౌండేషన్‌ నుంచి 1.7 మిలియన్‌ డాలర్ల సాయం బిల్ గేట్స్ అందించినట్లు సమాచారం. రెండేళ్లలో పురుషుల కోసం ప్రత్యేకంగా ఈ మాత్రలు అందుబాటులోకి రానున్నాయట. 2015-19 మధ్య కాలంలో 121 మిలియన్ల మంది మహిళలు ఇష్టం లేకున్నా గర్భం దాల్చారని పలు సర్వేల్లో వెల్లడైంది. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ మాత్రలు తయారుచేయడానికి ముందుకు వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఈ మాత్రలు అందుబాటులోకి వస్తే మహిళల అవాంఛిత గర్భాలకు చెక్ పెట్టినట్లే. మగవారు సైతం కండోమ్ వలన వచ్చే ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఫర్ సేఫ్ సెక్స్ కోసం ఈ మాత్రలు అందుబాటులోకి రావాలని పురుషులు భావిస్తున్నారట.

Advertisement

Next Story

Most Viewed