హేటర్స్‌కు మలయాళీ సింగర్ క్లాస్..

by Shyam |   ( Updated:2023-03-31 17:31:09.0  )
హేటర్స్‌కు మలయాళీ సింగర్ క్లాస్..
X

దిశ, వెబ్‌‌డెస్క్ : మలయాళీ సింగర్ సితార కృష్ణకుమార్ సోషల్ మీడియాలో తన హేటర్స్‌కు సమాధానమిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్ల నెగెటివిటీ, అసభ్యకర కామెంట్స్ మీద పోస్ట్ చేసిన ఆమె హార్ట్ ఫెల్ట్ వీడియో ఆలోచింపజేస్తోంది. ఒక షో షూటింగ్ కోసం ట్రెడిషనల్‌గా, బ్యూటిఫుల్‌గా తయారై ఫొటోస్‌ తీసుకుంటాం.. మన ఫ్యామిలీ, పిల్లలతో కలిసి ట్రావెల్ చేసినప్పుడు పర్సనల్ ఇంట్రెస్ట్‌తో రెడీ అయిన ఫొటోస్ తీసుకుంటాం. ఎందుకంటే అవి మనలో ఆనందాన్ని నింపుతాయి. ఆ ఫొటోలు పోస్ట్ చేసినప్పుడు.. మన ఫ్రెండ్స్ ఇచ్చే పాజిటివ్ కామెంట్స్ పాజిటివిటీని ఇచ్చి హ్యాపీగా ఉంచుతాయని మాత్రమే ఇలా చేస్తాం. కానీ ఇది మరో దారిలో వెళ్తోంది’ అని చెప్పింది.

నేరుగా షూటింగ్ నుంచి వచ్చి ఈ వీడియో చేసిన తాను.. మేకప్ తీసేస్తే ఎలా ఉంటుందో చూపించింది. ఫుల్ మేకప్, మంచి డ్రెస్సింగ్‌తో ఫొటో పోస్ట్ చేస్తే.. డిగ్నిఫైడ్, బ్యూటిఫుల్, ట్రెడిషనల్ ఉమెన్ అని చెప్పినవారే.. నార్మల్ సారీ వేసుకుని, మేకప్ లేకుండా ఫ్యామిలీతో దిగిన ఫొటోలు పోస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని తెలిపింది. చాలా ప్రాబ్లమెటిక్‌గా ఫీల్ అవుతున్నట్టు వెల్లడించింది. ఆర్టిఫిషియల్ అందానికే జై కొడుతున్న వాళ్లను.. మనం అలాగే పుట్టామా ఏంటి? అని ప్రశ్నించింది. తన కొడుకుతో ట్రావెలింగ్ చేసే టైమ్‌లో బ్లూ ఐ షాడో వేసుకున్న ఫొటో అప్‌లోడ్ చేస్తే.. నువ్వు ట్రాన్స్‌జెండర్‌లా ఉన్నావ్? దొంగతనం కేసులో పోలీసులు పట్టుకున్న బెంగాలీ మహిళలాగా ఉన్నావ్? రోడ్ సైడ్ చపాతీ అమ్ముకుంటున్న నార్త్ ఇండియన్‌లా ఉన్నావ్? చెత్త ఏరుకునే దానిలా ఉన్నావ్? 50 ఏళ్ల ముసలిదానిలా ఉన్నావ్? అని పలు అసభ్యకర కామెంట్స్ పెట్టారని తెలిపింది సితార.

ట్రాన్స్‌జెండర్, బెంగాలీ ఉమెన్, నార్త్ ఇండియన్‌లను అలా తప్పుగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించింది. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలతో పాటు విభిన్న పరిస్థితులు ఉంటాయి. వాటన్నంటిని అర్ధం చేసుకోవాలని సూచించింది. సరే ఏదో ప్రొఫైల్ లేని వ్యక్తి కామెంట్ చేస్తున్నాడు అంటే ఓకే. కానీ సమాజంలో ప్రాపర్ ఐడెంటిటీ ఉన్నవాళ్లు కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం సిగ్గుచేటన్నారు సితార. ఇతరుల ఫీలింగ్స్ హర్ట్ చేయడం తప్పని తెలియదా? అని ప్రశ్నించింది. మనుషులు అన్నాక ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుంది. ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చాల్సిన అవసరం లేదు.. కానీ ఇష్టాలు అయిష్టాల గురించి ఎక్స్ ప్రెస్ చేసేటప్పుడు చెప్పే విధానం బాగుండాలని అభిప్రాయపడింది సితార.

Advertisement

Next Story

Most Viewed