నెట్టింట నటి పోర్న్ వీడియో వైరల్..

by Shyam |   ( Updated:2021-06-22 04:10:27.0  )
నెట్టింట నటి పోర్న్ వీడియో వైరల్..
X

దిశ, సినిమా : మలయాళం యాక్ట్రెస్ రమ్యా సురేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పోర్నోగ్రాఫిక్ కంటెంట్‌లో తన ఫేస్ మార్ఫ్ చేసిన వీడియో ఆన్‌లైన్‌లో సర్క్యూలేట్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోలో రమ్య ఫేస్ కనిపిస్తున్నా.. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఈ వీడియో ఎడిట్ చేసిందని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని లక్షల మందిని రీచ్ అయిన ఈ క్లిపింగ్ తన నోటీస్‌లోకి రావడంతో అలప్పుజ పోలీస్ స్టేషన్‌తో పాటు సైబర్ సెల్‌లో కంప్లెయింట్ చేసినట్లు రమ్య తెలిపింది.

ఫిర్యాదు స్వీకరించిన అధికారులు తనకు సపోర్ట్ చేస్తూ వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారని, వాట్సప్ గ్రూప్‌ డేటాను సేకరించి ఈ వీడియో స్ప్రెడ్ చేస్తున్న వ్యక్తిని కనుగొన్నారని తెలిపింది. క్లిప్‌ను ఇప్పటికే చాలా మంది చూసి ఉంటారని.. అలాంటప్పుడు అందులో ఉన్నది తాను కాదని ప్రతీ ఒక్కరి దగ్గరికి వెళ్లి చెప్పలేనని బాధపడింది. ఈ ఇన్సిడెంట్ తన మెంటల్ హెల్త్‌ను ప్రభావితం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది రమ్యా సురేష్.

Hand symbol 19 మంది భర్తలకు ఒక్కతే భార్య.. రూ.2.28 కోట్ల కట్నం..

Advertisement

Next Story