- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రేజీ చాన్స్ మిస్ చేసుకున్న ‘మాస్టర్’ హీరోయిన్
తన హాట్ లుక్స్‌తో మలయాళ, కన్నడ ప్రేక్షకులను మాయ చేసిన హీరోయిన్ మాళవిక మోహనన్. దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ‘పట్టం పోలే’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన మాళవిక.. ఆ తర్వాత మాలీవుడ్, శాండల్‌వుడ్‌లో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించింది. గతేడాది కోలీవుడ్‌లో ‘పేట’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు పొందింది. దీంతో వెంటనే స్టార్ హీరో విజయ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ‘మాస్టర్’ సినిమాలో విజయ్‌తో ఆడిపాడిన భామకు ప్రస్తుతం టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది.
మాస్ మహారాజ రవితేజ చేయబోతున్న ఓ చిత్రంలో నటించమని ఈ బ్యూటీని సంప్రదించారట నిర్మాతలు. మంచి రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. కానీ కరోనా కారణంగా వాయిదా పడిన ‘మాస్టర్’ సినిమా రిలీజ్ అయ్యాకే.. ఆ ఫలితాన్ని బట్టి మరో సినిమా కమిట్ అవ్వాలని నిశ్చయించుకుందట మాళవిక. దీంతో రవితేజ పక్కన నటించే చాన్స్‌ను సున్నితంగా తిరస్కరంచినట్లు తెలుస్తోంది.
‘మాస్టర్’ సినిమా విడుదలకు ముందే సాంగ్స్ అండ్ లుక్స్‌తో తమిళనాట భారీ హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుంది భామ. ఇది కనుక క్లిక్ అయితే కోలీవుడ్‌లో పాగా వేయాలని ట్రై చేస్తోందట. లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన మాస్టర్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. జావియర్ బ్రిట్టో బ్యానర్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్ర ఆల్బమ్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
కాగా విజయ్ దేవరకొండ హీరో సినిమాలోనూ హీరోయిన్‌గా మాళవికనే ఎంచుకున్నా.. పలు కారణాల వల్ల ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది.