ఎప్పుడూ మగవాళ్లకే అలాంటి ఫన్ ఎందుకు? : మాళవిక

by Jakkula Samataha |
malavika-mohanan
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ మాళవికా మోహనన్ ‘మాస్టర్’ సినిమాతో ఓ రేంజ్‌కు వెళ్లిపోయింది. తమిళ్, మలయాళం ఫిల్మ్ మేకర్స్‌ ప్రస్తుతం తననే ఫస్ట్ చాయిస్‌గా ఎంచుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో హాటెస్ట్ హీరోయిన్స్‌లో ఒకరిగా పిలవబడుతున్న మాళవిక లేటెస్ట్ పోస్ట్ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది. ప్రతీసారి హాట్ అండ్ బోల్డ్ ఫొటోస్‌తో కుర్రాళ్ల మనసు దోచుకునే భామ.. ఈసారి డిఫరెంట్‌గా ట్రై చేసింది.

గతంలో బైక్ రైడింగ్ అంటే ఇష్టమని, బైక్ మీద ఇండియా అంత చుట్టేయాలనిపిస్తోందని తెలిపిన మాళవిక.. చెన్నై సిటీలో స్టైలిష్‌గా మోటార్ బైక్ నడుపుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో అభిమానులతో పంచుకుంది. ఎందుకు ఎప్పుడూ బాయ్స్ మాత్రమే ఫన్ కలిగి ఉండాలి? మనమెందుకు కాదు? అంటూ రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై రైడ్‌కు వెళ్తున్న క్లిపింగ్ షేర్ చేసింది. దీనిపై మాళవిక ఫ్యాన్స్ హార్ట్ సింబల్స్, ఎమోజీలతో కాంప్లిమెంట్స్ ఇస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి కూడా రియాక్ట్ అయింది. ‘టామ్ గర్ల్.. లుకింగ్ గ్రేట్’ అంటూ పొగిడేసింది.

https://www.instagram.com/reel/CRGpYwyFXEq/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story

Most Viewed