మాళవికాకు నెటిజన్ల వార్నింగ్.. ఎందుకంటే ?

by Shyam |
malavika
X

దిశ, సినిమా : బాలీవుడ్ చార్మింగ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు హాట్ అండ్ క్యూట్ బ్యూటీ మాళవికా మోహనన్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఫైనల్‌గా తన ఫేవరెట్ యాక్టర్‌తో కలిసి నటించే అవకాశం వచ్చిందంటూ సంబరపడిపోయిన మాళవిక.. తనతో ఉన్న పిక్చర్‌ పోస్ట్ చేసింది. ప్రముఖ ఈ – కామర్స్ వెబ్‌సైట్‌కు సంబంధించిన అడ్వర్‌టైజ్మెంట్‌ షూట్‌లో రణ్‌బీర్‌తో కలిసి పాల్గొన్న ఆమె ఈ పిక్ షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పోస్ట్‌పై కామెంట్ చేసిన ఫ్యాన్స్.. ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుంటుందని కోరుకున్నారు. కాగా రణ్‌బీర్.. అలియాను వదిలేసి మాళవికకు ‘ఐ లవ్ యూ’ చెప్తాడని కామెంట్ చేసిన కొందరు నెటిజన్లు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story