హాట్ బ్యూటీ ఎంగేజ్‌మెంట్ పిక్.. కంగ్రాట్స్ చెప్తున్న నెటిజన్లు

by Shyam |
Malaika Arora
X

దిశ, సినిమా : బాలీవుడ్ రొమాంటిక్ లవ్ బర్డ్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ దాదాపు నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. వీరి పెళ్లిపై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉండగా.. మలైకా లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మరోసారి ఈ విషయంపై చర్చించుకునేందుకు కారణమైంది. వేలికి ఉంగరంతో ఉన్న ఫొటో పోస్ట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ యాడ్ చేసిన మలైక.. ‘ఈ రింగ్ కోసం అమ్మాయిగా ఎన్ని కలలు కన్నాను.. హ్యాపీనెస్‌కు కొత్త రూపమిచ్చే ఈ మూమెంట్‌ను లవ్ చేస్తున్నా. మీరు మీ పార్ట్‌నర్ కోసం అద్భుతమైన రింగ్ ఇవ్వాలనుకుంటే ఓర్నాజ్‌లో ఆర్డర్ చేయొచ్చు. అంతేకాదు మీకు నచ్చినట్లుగా డిజైన్ చేయించుకోవచ్చు’ అని తెలిపింది.

ఈ ఫొటో.. పెయిడ్ పార్ట్‌నర్‌షిప్‌లో పోస్ట్ చేయడంలో భాగమైనా, అభిమానులు మాత్రం అర్జున్ కపూర్‌తో మలైకా ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే ‘మీరు అర్జున్ ప్రేమను యాక్సెప్ట్ చేశారా? కంగ్రాచ్యులేషన్స్.. అర్జున్‌తో మీ భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్’ అని చెప్తున్నారు.

Advertisement

Next Story