సెలవుల తర్వాత స్కూల్‌కు వెళ్ళినట్లుంది : మలైకా

by Shyam |   ( Updated:2020-07-27 01:04:50.0  )
సెలవుల తర్వాత స్కూల్‌కు వెళ్ళినట్లుంది : మలైకా
X

బాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ.. మలైకా అరోరాకు వయసు పెరిగినా వన్నె తరగని అందం తనది. కరోనా కారణంగా దాదాపు నాలుగు నెలలు ఇంటికే పరిమితమైన ఈ ఫిట్ బ్యూటీ.. చాలా రోజుల తర్వాత షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లింది. అయితే ఇన్ని రోజుల తర్వాత షూటింగ్‌లో పాల్గొనడం.. తనకు సుదీర్ఘ సెలవుల తర్వాత స్కూల్‌కు వెళ్తున్న అనుభూతి కలుగుతోందని చెప్పింది. స్నేహితులను కలిసేందుకు చాలా ఉత్సాహంగా ఉందన్న మలైకా.. కానీ మిశ్రమ భావోద్వేగాలతో ఉన్నానని చెప్తుంది.

‘ఉత్సాహం, భయం, ఆనందం అన్నీ కలిసున్నాయి.. కానీ పనిని కంటిన్యూ చేయడం తప్పనిసరి’ అని తెలిపింది. అదనపు జాగ్రత్తలు, అదనపు ప్రయత్నాలు.. ప్రతీది సరిగ్గా జరుగుతుందనే నమ్మకంతో షూటింగ్‌కు హాజరవుతున్నట్లు చెప్పింది. షూటింగ్ స్పాట్‌లో కరోనా భయం లేకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నారని.. ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉన్నారని తెలిపింది. జీవితాన్ని పునఃప్రారంభిచే సమయం వచ్చిందని.. తగు జాగ్రత్తలతో ముందుకు సాగాలని సూచించింది మలైకా.

గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక ఐటెం సాంగ్‌తో టాలీవుడ్‌ను కేక పుట్టించిన మలైకా.. హిందీలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కొన్ని రియాలిటీ షోస్‌కు కూడా జడ్జ్‌గానూ వ్యవహరిస్తున్న మలైకా.. భర్త అర్భాజ్ ఖాన్‌తో విడిపోయి, ప్రస్తుతం యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో రిలేషన్‌షిప్ కొనసాగిస్తోంది.

https://www.instagram.com/tv/CDIZZ0ZBzAQ/?igshid=1p5mar3cqhfcv

Advertisement

Next Story

Most Viewed