కరోనాతో ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ మృతి

by Shyam |
కరోనాతో ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ మృతి
X

దిశ, సినిమా : ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ కరోనాతో మృతిచెందారు. ఉత్తమ మేకప్‌మెన్‌గా నంది అవార్డు అందుకున్న ఆయన.. తెలుగు, తమిళం, కన్నడతో పాటు హిందీ స్టార్స్‌కు కూడా మేకప్‌మెన్‌గా వర్క్ చేశారు. హీరో శివాజీకి పర్సనల్ మేకప్‌ మెన్‌గా కొన్నాళ్ల పాటు పనిచేశారు. గంగాధర్ మరణం కలిచివేస్తోందన్న శివాజీ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఇక లక్కీ మీడియా నిర్మాణ సంస్థలో గంగాధర్ చీఫ్ మేకప్ మెన్‌గా పని చేయగా.. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ సినిమా నుంచి తమ బ్యానర్‌లో వచ్చిన అన్ని సినిమాలకు తనే మేకప్ మెన్‌గా వర్క్ చేశారని తెలిపాడు నిర్మాత వేణుగోపాల్. గంగాధర్ మరణంతో కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లుగా ఉందన్న ఆయన.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Next Story