- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేజీఎఫ్ 2’ రిలీజ్‌పై గుడ్ న్యూస్.?
దిశ, సినిమా : ప్రశాంత్ నీల్ – యశ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘కేజీఎఫ్ 2’ రిలీజ్ కోసం సినీ అభిమానులు దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. పాండమిక్ కారణంగా ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడ్డ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ విషయంపై గురువారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు సంజయ్ దత్ పుట్టినరోజు కావడంతో అభిమానులకు కచ్చితంగా సర్‌ప్రైజ్ ఉంటుందనేది టాక్. అంతేకాదు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు 2 వారాల ముందుగా లేదంటే తర్వాత అయినా ‘కేజీఎఫ్ 2’ రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమచారం.
కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్.. చిన్న ట్రైలర్ మాత్రమే అని, అసలు సినిమా ‘కేజీఎఫ్ 2’లో చూపిస్తానంటూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఆ మధ్య రిలీజైన టీజర్ కూడా 100 మిలియన్ వ్యూస్‌తో సినిమా క్రేజ్‌ను చాటిచెప్పింది. ఈ నేపథ్యంలోనే రేపు సంజయ్ బర్త్‌డే సందర్బంగా విడుదల తేదీని ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ ‘సలార్’ మూవీతో బిజీగా ఉండగా.. యశ్ మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.