దేశభక్తిని నిర్వచించిన ‘మేజర్’.. సెల్యూట్ టు సోల్జర్

by Jakkula Samataha |
దేశభక్తిని నిర్వచించిన ‘మేజర్’.. సెల్యూట్ టు సోల్జర్
X

దిశ, సినిమా : అడవి శేషు టైటిల్‌ రోల్ ప్లే చేస్తున్న ‘మేజర్’ టీజర్ దేశభక్తితో నిండిపోయింది. సోల్జర్ అంటే ఎవరు? ఎందుకు కావాలనుకుంటారు? వారి పనేంటి? అనే ప్రశ్నకు.. ‘బార్డర్‌లో ఆర్మీలా ఫైట్ చేయాలి, ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌లో గెలవాలి అని అందరూ ఆలోచిస్తారు. అదీ దేశభక్తే.. దేశాన్ని ప్రేమించడం అందరి పనే! కానీ వాళ్లను కాపాడటం సోల్జర్ పని’ అని సమాధానమిస్తూనే.. ‘ది హీరో ఆఫ్ 26/11’ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ హీరోయిజం గురించి స్మాల్ ఎగ్జాంపుల్ ఇచ్చింది టీజర్. ‘డోంట్ కమ్ అప్.. ఐ విల్ హ్యాండిల్ దెమ్(పైకి రావొద్దు.. నేను వాళ్లను హ్యాండిల్ చేస్తా)’ అన్న మేజర్ సందీప్ లాస్ట్ వర్డ్స్ టీజర్‌లో హైలెట్ కాగా, అడవి శేషు నుంచి మరో క్రేజీ స్టఫ్ వచ్చేస్తోంది అంటున్నారు సినీ లవర్స్. మూడు భాషల్లో రిలీజ్ కాబోతున్న సినిమాకు శశి కిరణ్ దర్శకులు కాగా.. స్టోరీ, స్క్రీన్‌ప్లే అడవి శేషు. ఇక శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన సినిమాకు స్క్రిప్ట్ గైడెన్స్, తెలుగు డైలాగ్స్ అబ్బూరి రవి సమకూర్చారు. కాగా సూపర్ స్టార్స్ మహేష్ బాబు, సల్మాన్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్.. తెలుగు, హిందీ, మలయాళ టీజర్స్ రిలీజ్ చేశారు.

https://twitter.com/GMBents/status/1381556459519942660?s=20

Advertisement

Next Story