భారీ రేటుకు అమ్ముడుపోయిన ‘మేజర్’

by Shyam |
భారీ రేటుకు అమ్ముడుపోయిన ‘మేజర్’
X

దిశ, సినిమా : 26/11 ముంబై టెర్రర్ అటాక్‌లో అమరులైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్’. అడవి శేషు టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమాకు శశికిరణ్ దర్శకత్వం వహిస్తుండగా.. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ హిందీ వెర్షన్ శాటిలైట్ రైట్స్ రూ. 10 కోట్లకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాల, ప్రకాష్ రాజ్, రేవతి ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమాకు సంబంధించిన తెలుగు, మలయాళం వెర్షన్ శాటిలైట్స్ డిటెయిల్స్ త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story