- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు చోట్లా నష్టమే..ఎమ్ అండ్ ఎమ్ నిరాశ!
దేశీయ దిగ్గజ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు దారుణమైన నష్టాల్ని మూటగట్టుకున్నాయి. అటు సెన్సెక్స్‌లోనూ, ఇటు నిఫ్టీలోనూ రెండు చోట్లా 5% పైగా నష్టాల్ని చవిచూసింది. సంస్థ నికర లాభం 73% క్షీణతను నమోదు చేసింది. గత త్రైమాసికంలో రూ. 380 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో మహీంద్రా అండ్ మహీంద్రా నికర లాభం రూ. 1,396 కోట్లుగా ఉండేది.
ఫలితాల అనంతరం, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ ధర ఇంట్రాడేలో కనిష్టంగా రూ. 536.45కు చేరుకుంది. ఇది ఇంతకుముందు ఉన్న రూ. 568.80 తో పోలిస్తే 5.69% తక్కువ. గడిచిన మూడు సెషన్లలో మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ 7.75% పడిపోయింది. ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్ మూలధనం రూ. 68,407 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో సంస్థ ఆదాయం 6% తగ్గి రూ. 12,120 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికం కాలానికి రూ. 12,893 కోట్లుగా ఉండేది. ఈ త్రైమాసికంలో నిర్వహణ లాభం 13.2% నుంచి 14.8%కి పెరిగింది.
ఇండియన్ ఆటో, ట్రాక్టర్ పరిశ్రమలు రెండూ డిసెంబర్ త్రైమాసికానికి తిరోగమనంలో పయనించాయని సంస్థ వెల్లడించింది. ఇదే క్రమంలో,ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి 2020 ఏప్రిల్ 1న వైదొలగాలని ఆనంద్ మహీంద్ర నిర్ణయాన్ని విరమించుకున్నారు. 2021 నవంబర్ 11 వరకు కొనసాగడానికి అంగీకరించినట్టు సంస్థ ప్రకటించింది.