మహేశ్ హృదయాన్ని హత్తుకున్న ‘ఉప్పెన’

by Jakkula Samataha |   ( Updated:2021-02-23 01:11:11.0  )
మహేశ్ హృదయాన్ని హత్తుకున్న ‘ఉప్పెన’
X

దిశ, సినిమా: భారీ కలెక్షన్స్, నంబర్ ఆఫ్ రికార్డ్స్‌తో దూసుకుపోతున్న ‘ఉప్పెన’ సినిమా సూపర్‌స్టార్ మహేశ్ బాబును సైతం ఇంప్రెస్ చేసింది. ‘ఉప్పెన’ చిత్రాన్ని ఓ క్లాసిక్‌గా అభివర్ణించిన మహేశ్.. అరుదైన టైమ్‌లెస్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ బుచ్చిబాబును చూస్తుంటే గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల స్టెల్లర్ పర్ఫార్మెన్సెస్‌ హృదయాన్ని హత్తుకున్నాయని.. నిజంగా వీరిద్దరూ స్టార్స్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సినిమాను నిర్మించి బ్యాక్ సపోర్ట్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌‌ను అభినందించారు.

కాగా ఈ ట్వీట్‌పై స్పందించిన డైరెక్టర్ బుచ్చిబాబు.. తన మొదటి హీరో, సూపర్‌స్టార్ మహేశ్ బాబు నుంచి ఇంత గొప్ప ప్రశంసలు అందుకోవడం చాలా స్పెషల్‌గా ఉందని తెలిపాడు. మీరు నిజంగా సూపర్‌స్టార్ అంటూ ధన్యవాదాలు తెలిపాడు. ఈ ట్వీట్ ఆటోమేటిక్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు ‘నంబర్1 నేనొక్కడినే’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు మహేశ్‌పై క్లాప్ ఇస్తున్న ఫొటోను షేర్ చేస్తూ అభినందిస్తున్నారు నెటిజన్లు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా క్లాప్ ఇచ్చిన ఫొటో, డైరెక్టర్‌గా కాంప్లిమెంట్స్ అందుకున్న ట్వీట్‌ను పోలుస్తూ.. బుచ్చిబాబు టాలెంట్‌కు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

https://twitter.com/BuchiBabuSana/status/1363921413195714561?s=20

Advertisement

Next Story