- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిద్దాం : మహేష్
కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇది కఠినమైన పరిస్థితి అని… కానీ మనం దీన్ని అధిగమించాలని పిలుపునిచ్చారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేందుకు మన సామాజిక జీవితాన్ని త్యాగం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని… కుటుంబంతో, మీకు ఇష్టమైన వారితో ఇంట్లోనే గడపాలని సూచించారు ప్రిన్స్. తద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని.. చాలా మంది ప్రాణాలను కాపాడుతుందన్నారు. తరుచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని… వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీలైనంత వరకు హ్యాండ్ శానిటైజర్లు వాడాలన్న మహేష్… అనారోగ్యంగా ఉన్నారని అనుకుంటే మాత్రమే మాస్క్‌లు ధరించాలని సూచించారు. కరోనా ప్రభావం ముగిసేవరకు ఈ జాగ్రత్తలను పాటించాలన్నారు. కలిసి ఉందాం… కోవిడ్ 19ను కలిసి ఓడిద్దాం అని పిలుపునిచ్చారు మహేష్. మనం బాధ్యతాయుతంగా ఉంటే ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు.