ధోని వీ మిస్ యూ : ఫ్యాన్స్

by Shyam |   ( Updated:2020-08-15 10:51:32.0  )
ధోని వీ మిస్ యూ : ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: 74వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున టీం ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మైంట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ఇండియాకు మరోసారి టీ20 వరల్డ్ కప్ అందిస్తాడు అనుకున్న ధోని ఇలా సడన్‌గా తన నిర్ణయాన్ని ప్రకటించడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

‘ఎందుకిలా చేశావ్ ధోని’ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మిస్టర్ కూల్‌ను ప్రశ్నిస్తున్నారు. ‘త్వరలోనే నీ ఆట చూస్తాం.. అనుకునే వాళ్లను నిరాశకు గురిచేశారు.. నువ్వు ఒక లెజెండ్.. నీ బ్యాటింగ్ స్టైల్ ను మేమంతా మిస్ అవుతున్నాం’.. అంటూ పోస్టులు పెడుతూ ధోని మీద తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Advertisement

Next Story