మహాత్మా గాంధీ మంచు శిల్పం ఆవిష్కరణ.. ఎక్కడంటే

by Sujitha Rachapalli |
మహాత్మా గాంధీ మంచు శిల్పం ఆవిష్కరణ.. ఎక్కడంటే
X

దిశ, ఫీచర్స్ : భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 75 వారాలపాటు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున 75 కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ఉత్సవాలను భారత ప్రధాని మోడీ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఉత్సవాలు జరుపుతుండగా, విదేశాల్లోనూ వేడుకలు నిర్వహించడం విశేషం. తాజాగా కెనడియన్ హోటల్ ‘అమృత్ మహోత్సవ్’లో భాగంగా భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, జాతిపిత మహాత్మా గాంధీ మంచు శిల్పాన్ని ఆవిష్కరించింది.

మహాత్మా గాంధీ తన అహింసా సిద్ధాంతంతో కేవలం భారతదేశాన్ని మాత్రమే కాదు ప్రపంచాన్నే అట్రాక్ట్ చేశాడు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరిట సంస్థలు, విగ్రహాలు, కాలనీలు, టౌన్లు ఏర్పాటు చేశారు. అమృత్ మహోత్సవాల్లో భాగంగా కెనడాలోని క్యుబెక్ సిటీలో ఉన్న ఐకానిక్ కెనడియన్ హోటల్ ‘హోటల్ ది గ్లేస్’.. మహాత్మా గాంధీ మంచు శిల్పాన్ని ఏర్పాటు చేసి గాంధీకి నివాళి అర్పించింది. గాంధీ హ్యుమానిటేరియన్ వర్క్‌ను గౌరవిస్తూ ఈ శిల్పాన్ని ఆవిష్కరించినట్లు హోటల్ నిర్వాహకులు తెలిపారు.

7 అడుగుల ఎత్తున్న ఈ మంచు విగ్రహాన్ని కెనడాకు చెందిన ప్రఖ్యాత మంచు శిల్పి మార్క్ లెపైర్ రూపొందించారు. ఈ శిల్పం ఏర్పాటు పట్ల భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంబురాల్లో భాగంగా మహాత్మ గాంధీ శిల్ప తయారీకి ఉత్తమ శిల్పిని ఎన్నుకోవడమే కాకుండా పూర్తి చేయించి. సిటీ సెంట్రల్ స్పాట్‌లో ఏర్పాటు చేసిన హోటల్ నిర్వాహకులను అభినందిస్తున్నారు.

Advertisement

Next Story