మహా సముద్రం.. మామూలుగా లేదు..

by Shyam |   ( Updated:2023-12-16 14:56:43.0  )
మహా సముద్రం.. మామూలుగా లేదు..
X

దిశ, సినిమా : రిలేషన్స్, ఎమోషన్స్‌ చుట్టూ అల్లుకున్న కథను ఆసక్తికరంగా తెరకెక్కించాలంటే అందరికి సాధ్యం కాదు. కానీ మొదటి సినిమా ‘ఆర్‌ఎక్స్ 100’తోనే తన క్యాలిబర్ ఏంటో నిరూపించుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ప్రస్తుతం శర్వానంద్, సిద్ధార్థ్‌తో ‘మహా సముద్రం’ పేరుతో మల్టీస్టారర్‌ను డైరెక్ట్ చేయగా శనివారం ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘భుజాల మీదున్న బరువును బలమున్నోడు ఎవడైనా మోస్తాడు.. కానీ మనసులో ఉన్న బాధను బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైనా, స్నేహమైనా!’ అని శర్వా చెప్పే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్.. ఇంట్రెస్టింగ్ సీన్లు, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌లతో క్యూరియాసిటీని పెంచగలిగింది.

ట్రైలర్‌లో వచ్చిన డైలాగ్‌ను బట్టి ఇందులో శర్వా సబ్ ఇన్‌స్పెక్టర్ క్యారెక్టర్ ప్లే చేసినట్లు తెలుస్తుండగా.. ఒక సీన్‌లో ఫ్రెండ్‌ సిద్ధార్థ్‌తో తనకు గొడవను చూపి మరింత ఆసక్తి కలిగించారు. ఇక అధితిరావు, అను ఇమ్మాన్యుయేల్ ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తున్న సినిమాలో జగపతి బాబు, రావు రమేష్‌ల విలనిజానికి తోడైన కామెడీ టచ్‌ కంటెంట్‌పై నమ్మకాన్ని పెంచింది. మొత్తానికి పవర్‌ఫుల్ ట్రైలర్‌తో హీటెక్కించిన ‘మహాసముద్రం’.. ఈ నెల 14న రిలీజ్ కానుంది.

Advertisement

Next Story