వలస కూలీల వివరాలు సేకరించండి

by Shyam |   ( Updated:2020-03-28 03:02:16.0  )
వలస కూలీల వివరాలు సేకరించండి
X

దిశ, మహబూబ్‌నగర్: ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వలస వచ్చిన కూలీల వివరాల సేకరణకు సంబంధించి క్విక్ సర్వే శనివారం సాయంత్రం 6గంటల లోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వెంకటరావు ఆదేశించారు. ఈ అంశంపై శనివారం ఉదయం కలెక్టర్ తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలను చేశారు. సర్వేలో మెడికల్ సిబ్బంది భాగస్వామ్యం కావాలని కోరారు. మెప్మా, ఏపీఎంలు, వీవోలు సర్వేలో పాల్గొనాలని సూచించారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన ఏవోలు, ఏఈఓలు కూడా భాగస్వాములు కావాలని, అంతేకాక పశుసంవర్థక శాఖకు సంబంధించిన అధికారులనుంచి మొదలుకొని అటెండర్ వరకు సర్వేలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని నూటికి నూరు శాతం క్వారంటైన్‌లో ఉంచాలని, ఎక్కడైనా పాజిటివ్ కేసు వచ్చినట్లయితే తక్షణమే ఉన్నత అధికారులకు తెలియజేయాలని అదేశించారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు ఈనెల 29న ఆదివారం మరోసారి అన్ని గ్రామాలు, మున్సిపల్ పట్టణాలలో ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు యాంటీ లార్వా ఆపరేషన్స్ చేపట్టాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని ఆదేశించారు.

Tags: collector, video confarance, quick servey

Advertisement

Next Story