- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారానికొకరోజు గ్రామస్థులంతా శ్రమదానం చేయాలి
దిశ, మహబూబ్ నగర్: వారానికి ఒకరోజు గ్రామ ప్రజలందరూ కలిసి శ్రమదానం చేయాలని, ఆ విధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు.దేవరకద్ర మండలం హజిలాపూర్, లక్ష్మీపల్లిలో బుధవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మన చుట్టు ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునట్లయితే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు. అనంతరం లక్ష్మీపల్లిలో ఉన్న నర్సరీని సందర్శించారు. అక్కడ పెంచుతున్న మొక్కల గురించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బియ్యం పంపిణీ కార్యక్రామాన్నిపరిశీలించి..ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న రైతులతో కాసేపు ముచ్చటించారు. ఆపై తమ గ్రామంలో సాగునీటి సమస్యలను పరిష్కరించాలని రైతులు కలెక్టర్‌కు విన్నవించగా, స్పందించిన ఆయన త్వరలోనే పరిష్కారం చూపిస్తామన్నారు.