మీరు దేవుడితో సమానం… డాక్టర్ ను అభినందించిన జిల్లా ఎస్పీ

by Sridhar Babu |   ( Updated:2021-10-30 06:23:52.0  )
Sp-Kotireddy1
X

దిశ, కొత్తగూడ: కొత్తగూడ, గంగారం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం అవిశ్రాంత సేవలు అందిస్తూ ప్రజల మనస్సును గెలుచుకున్న డాక్టర్ ముక్రంను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గంగారం మండలం ఎంపీపీ సరోజన జగ్గారావు, జెడ్పీటీసీ ఈసం రమాసురేష్ మాట్లాడుతూ… కోమాట్లగూడ గ్రామంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి భారీ ఎత్తున ఏర్పాట్లను చేయడమే కాకుండా ముందుండి పూర్తిచేసి విజయవంతానికి కృషి చేశాడన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి అత్యధికంగా తరలించి రోగులను దగ్గరుండి పరీక్షలు నిర్వహించరన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ముక్రం విధులు చేపట్టిన మొదటి రోజు నుంచి క్రమం తప్పకుండా విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ నాణ్యమైన వైద్యాన్ని అందజేస్తున్నారని కొనియాడారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రసవ ఆపరేషన్ లను సైతం చేసి ఎన్నో ప్రాణాలను కాపాడుతూ దేవుడిలా నిలబడ్డాడని ప్రశంసల వర్షం కురిపించారు.

Advertisement

Next Story

Most Viewed