‘పాన్‌సెక్సువల్’ గురించి వివరిస్తున్న హీరోయిన్..

by Shyam |   ( Updated:2021-08-18 02:23:10.0  )
‘పాన్‌సెక్సువల్’ గురించి వివరిస్తున్న హీరోయిన్..
X

దిశ, సినిమా : హాలీవుడ్ బ్యూటీ మే విట్‌మన్.. డిస్నీ చానల్ యానిమేటెడ్ సిరీస్ ‘ది ఓల్ హౌజ్’లో భాగమైనందుకు హ్యాపీగా ఉందని తెలిపింది. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ గురించి చర్చించిన ఈ సిరీస్‌లో స్మాల్‌ పార్ట్ లభించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో తను ‘పాన్‌సెక్సువల్’ అని ప్రకటించిన ఈ 33ఏళ్ల యాక్ట్రెస్.. అంటే అర్థమేంటో కూడా వివరించింది. “పాన్‌సెక్సువల్ అంటే చాలా మంది ప్రజలకు తెలియదు. నాకు నేను అన్ని జెండర్స్‌కు సంబంధించిన వారితో ప్రేమలో పడతానని తెలుసు. ఇదే నాకు ఫిట్ అయ్యే బెస్ట్ వర్డ్. బైసెక్సువల్ కమ్యూనిటీలో భాగమైనందుకు గర్వంగా, సంతోషంగా ఉంది” అని ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన అభిమానులు “మేము నిన్ను ఆరాధిస్తున్నాం. మీ ఫ్యాన్స్ అయినందుకు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం.. లవ్ యూ” అని కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story