- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెరుగుతున్న కరోనా కేసులు.. పక్షులు కదలకుండా 3 నెలల బ్యాన్
దిశ,వెబ్‌డెస్క్: ఓ వైపు కరోనా, మరో వైపు కరోనా కొత్త స్ట్రెయిన్. ఇవి చాలవన్నట్లు కొత్తగా మరో దరిద్రం దాపురించింది. ఏడాది కాలంపైగా వణికిస్తున్న కరోనా వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని సంతోషపడుతుండగా.., ఆ ఆశలపై నీళ్లు చల్లుతుంది ఈ నయా వైరస్ బర్డ్ ఫ్లూ.
ముఖ్యంగా దేశంలోని మధ్య ప్రదేశ్ తో పాటు హర్యానా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, పంజాబ్‌లలో ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
మరోవైపు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడంపై కేంద్రం రాష్ట్రాల్ని అప్రమత్తం చేసింది. బర్డ్ ఫ్లూ, కరోనా వైరస్ కేసుల్ని కట్టడి చేసేలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో దేశంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాతో పాటూ బర్డ్ ఫ్లూ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అన్నీ రాష్ట్రాల కంటే మధ్యప్రదేశ్ ఓ అడుగు ముందుకేసి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసుల్ని నివారించేందుకు విచిత్రమైన ఉత్తర్వులు జారీ చేసింది! సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం..రాష్ట్ర పశుసంవర్ధక శాఖ రాష్ట్రంలోని మాండ్‌సౌర్, జాబువా, హర్దా, రైసెన్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని గుర్తించింది. దీంతో ఆయా జిల్లాలకు చెందిన పలు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ’కి కారణమయ్యే ఎగిరే పక్షులపై మూడు నెలల పాటు బ్యాన్ విధించింది. ఆంక్షలు విధించిన గ్రామాల్లోని పక్షులు పది కిలోమీటర్లు దాటి బయటకు తరలించడం కానీ లోపలికే తెచ్చే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.