కరోనా రోగిని అరెస్ట్ చేసిన పోలీసుకు పాజిటివ్

by vinod kumar |
కరోనా రోగిని అరెస్ట్ చేసిన పోలీసుకు పాజిటివ్
X

భోపాల్: కరోనా రోగిని అరెస్ట్ చేసిన పోలీస్‌కు కోవిడ్-19 పరీక్షలు జరుపగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఇండోర్‌లోని చందానగర్ ప్రాంతానికి చెందిన జావెద్ ఖాన్ (25) అనే వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ నెల 7న లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా, అడ్డొచ్చిన కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. దీంతో పోలీసులు వారిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ)కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం వారిలో కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా, ముగ్గురికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వీరిని ఈ నెల 11నుంచి జబల్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 19న జావెద్ ఆస్పత్రి నుంచి తప్పించుకుని ఓ ట్రక్‌ను లిఫ్ట్ అడిగి నర్సింగపూర్ దాకా వచ్చాడు. అనంతరం బైక్‌పై ఇండోర్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో పోలీసుల బృందం జావెద్‌ను అరెస్ట్ చేసింది. అనంతరం ఈ బృందాన్ని 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచి, కరోనా పరీక్షలు జరుపగా ఓ పోలీసుకు పాజిటివ్ వచ్చింది. మిగతావారికి నెగటివ్ వచ్చింది. ఈ విషయాన్ని జబలాపూర్ కలెక్టర్ భరత్ యాదవ్ స్పష్టం చేశారు.
Tags: Madhya Pradesh Cop Tests Positive, Coronavirus, corona, covid 19, cops tests positive, indore

Advertisement

Next Story