మధ్యప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్‌కు కరోనా

by Anukaran |
మధ్యప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్‌కు కరోనా
X

భోపాల్: మధ్యప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్ మోహన్ యాదవ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే నలుగురు క్యాబినెట్ మంత్రులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ తేలిందని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. అనంతరం అరవిందో ఆసుపత్రిలో చేరినట్టు వివరించారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ మంగళవారం రాత్రి ట్వీట్ చేశారు.

ఇదివరకే వైద్యవిద్య శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్, కోఆపరేటివ్ మంత్రి అరవింద్ బదోరియా, వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి రామఖేలవన్ పటేల్, నీటి వనరుల మంత్రి తులసీరాం సిలావత్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గతనెల చివరిలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ కూడా కరోనాతో ఆసుపత్రి చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story