- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు కమల్‌నాథ్ సర్కార్ బలపరీక్ష
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో నేటి మధ్యాహ్నం 2 గంటలకు కమల్ నాథ్ సర్కార్ బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈమేరకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని స్పీకర్ ప్రజాపతికి ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్పీకర్ అసెంబ్లీని ఈనెల 26 వరకు వాయిదా వేశాడు. అయితే ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ జరిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం పలు సూచనలు చేసింది. ‘రాజకీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను చక్కదిద్దేందుకు సభలో విశ్వాస పరీక్ష ఖచ్చితంగా జరపాలి. రాజీనామా చేసిన 16 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఓటింగ్‌లో పాల్గొన్నాలి. వారి రక్షణ కల్పించాలి. విశ్వాస పరీక్ష అంకం మొత్తం వీడియో తీయాలి. ప్రత్యక్ష ప్రసారం కూడా చేయవచ్చు. ఈ తంతు సాయంత్రం 5 గంటలలోపు ముగించాలి’ అని ధర్మాసం స్పష్టం చేసింది.
కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు. అతనితో పాటు మరో 16 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ సర్కార్ తీవ్ర సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే.