కోళ్లతోపాటు నెమలి మా ఇంటికొచ్చింది

by Sridhar Babu |
కోళ్లతోపాటు నెమలి మా ఇంటికొచ్చింది
X

దిశ, మధిర: అడవిలో ఉండే నెమలి కోళ్లతోపాటే వాళ్ల ఇంటికి వచ్చింది. ఇది గమనించిన ఆ ఇంటి ఓనర్ అధికారులకు సమాచారమిచ్చాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోనకల్ మండలం చిన్నబీరవల్లి గ్రామంలో రవి అనే వ్యక్తి ఇంటికి నిన్న సాయంత్రం వాళ్ల పెంపుడు కోళ్లతో పాటుగా నెమలి ఇంటికి వచ్చింది. సమాచారం తెలుసుకున్న మధిర డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ అధికారులు నెమలిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అడవి జంతువులు తప్పిపోయి గ్రామాల్లోకి వస్తే స్థానికులు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సీతారాములు, బీట్ ఆఫీసర్ కవిత, సురేష్ నెమలిని ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల ఫారెస్ట్ లో వీఆర్ఓ సమక్షంలో విడిచిపెట్టారు.

Advertisement

Next Story