పవన్‌ను ఫాలో అవ్వాల్సిందే: మాధవీలత

by Shyam |
పవన్‌ను ఫాలో అవ్వాల్సిందే: మాధవీలత
X

వర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఒక పవర్ హౌజ్ లాంటి వ్యక్తి. ఎందరో అభిమానులు ఆయన సొంతం. మహిళా అభిమానులు ఆయనంటే పడి చచ్చిపోతారు. వీరిలో హీరోయిన్ మాధవీ లత ఒకరు. శ్రీ రెడ్డి పవన్ పై అసభ్యంగా పోస్ట్ పెట్టిన ప్రతీ సారి … దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చేది. జనసేన పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్న మాధవి ఆ తర్వాత బీజేపీలో చేరాల్సి వచ్చింది.

అయితే పవన్ కూడా బీజేపీతో చేతులు కలపడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్. ఇద్దరూ ఇప్పుడు ఒకే గూటికి చేరడంతో మరో సారి పవన్ పై అభిమానాన్ని చాటుకుంది. పవన్ కళ్యాణ్ ను తిట్టిన వాళ్లే పవన్ వెంట తిరుగుతున్నారని … జనసేనాని గొప్పవాడు అంటూ పొగుడుతున్నారని విమర్శించింది. ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అన్నవారే… పవన్ వెనుక నడవాల్సి వస్తుందని బీజేపీ నాయకులను పరోక్షంగా విమర్శించింది.

సినిమా వాళ్లకున్న ఛార్మ్ అలాంటిది అని పవన్ ఉద్దేశించి మాట్లాడింది మాధవి. ఎవరైనా పవన్ వెనక నడవాల్సిందేనని చెప్పుకొచ్చింది. ఏపీ రాజకీయాలకు భయపడి పాలిటిక్స్ కు బై బై చెప్పెద్దాం అనుకున్న వాళ్లు… పవన్ ఉన్నాడని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారని చెప్పింది. పవనిజం అంటే అది అంటూ తన అభిమాన వ్యక్తిని పొగిడింది.

Advertisement

Next Story