- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముసలోడే కానీ.. మామూలోడు కాదు..
దిశ, అంబర్ పేట్: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మాడపాటి హనుమంత రావు బాలికల ఉన్నత పాఠశాలలో కరాటే విన్యాసాలు నిర్వహించారు. ఇందులో 70 ఏళ్ల డాక్టర్ కృష్ణారెడ్డి, 159 షాబాద్ బండరాళ్లను 7నిమిషాలలో తన ఛాతిపై పగుల గొట్టించుకున్నాడు. దాంతో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, జై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, డైమండ్ ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లలో స్థానం సంపాదించుకున్నాడు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ జడ్జ్ డాక్టర్ జస్టిస్ బూర్గుల మధు సూదన్ పాల్గొని డాక్టర్ కృష్ణారెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరాటే విద్య అనేది వయసుతో నిమిత్తం లేనిదని, ఏ వయసు వారైనా చేయొచ్చని డాక్టర్ కృష్ణా రెడ్డి నిరూపించారని కొనియాడారు. అనంతరం కరాటే అకాడమీ డైరెక్టర్ డాక్టర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణారెడ్డి రెండవ సారి ప్రపంచ రికార్డుల్లో స్థానం పొందడం అకాడమీకి ఎంతో గర్వకారణమని అన్నారు.
రికార్డులను సాధించడం కోసం వయసుతో నిమిత్తం లేకుండా సాధన చేయడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ప్రపంచ రికార్డుల్లో ఆయన పేరును నమోదు అయినట్టు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, జై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోఆర్డినేటర్ పేరడీ గురుస్వామి, విశ్వం వరల్డ్ బుక్ రికార్డ్స్ కోఆర్డినేటర్ విజయ రంగ, విశ్వం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి రికార్డుని ధృవీకరించారు. రికార్డ్ సర్టిఫికెట్లు డాక్టర్ కృష్ణరెడ్డికి అందజేశారు.