- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వైట్ ఫంగస్ అరుదైన వ్యాధి.. ఇలా చేస్తే ఏమి కాదు’
దిశ, తెలంగాణ బ్యూరో: వైట్ ఫంగస్ వ్యాధికి సరైన సమయంలో చికిత్సలు అందిస్తే ఎలాంటి ప్రమాదాలుండవని ఎల్‌వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ వివేక్ ప్రవీణ్ దావే తెలిపారు. వైట్ ఫంగస్ వ్యాధి అరుదుగా వచ్చే వ్యాధి అని ప్రస్తుతం భయపడాల్సినంతగా తీవ్రత లేదని స్పష్టం చేశారు. వైట్ ఫంగస్ వ్యాధి కంటిలోని రెటినాపై ప్రభావం చూపడం వలన దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. ఈ వ్యాధి సోకిన వారి కంటి ముందు నల్లని నీడ ఛాయలు ఏర్పడటం, నొప్పితో కన్ను ఎర్రబడటం వంటి లక్షణాలుంటాయన్నారు. కరోనా చికిత్సలో భాగంగా అధిక మోతాదులో స్టెరాయిడ్లను వినియోగించిన వారికి ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని తెలిపారు.
పేషెంట్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని తగ్గి ఈ ఫంగస్‌లు ఉత్పన్నమవుతాయన్నారు. రెండు కంటే ఎక్కవ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, మధుమేహం ఉన్నవారికి, దీర్ఘకాలికంగా స్టెరాయిడ్లు వినియోగిస్తున్న వారిలో కూడా వైట్ ఫంగస్ వ్యాధి తీవ్రత ఎక్కవగా ఉంటుందన్నారు.. కంటిగుడ్డు లోపలి భాగానికి సోకిన ఈ వ్యాధికి ఇంట్రాకోక్సుర్ సర్జరీ, ఇంజెక్షన్లతో చికిత్సలు చేపట్టి నయం చేయవచ్చన్నారు. సహజంగానే శరీరంలో ఉండే ఈ ఫంగస్ అతిగా పెరిగినట్లయితే ఆరోగ్య సమస్యలొస్తాయని స్పష్టం చేశారు. లాబరేటరీలో పరిశీలించినప్పుడు ఈ ఫంగస్ తెల్లగా కనిపించడం వలన దీనిని ‘వైట్ ఫంగస్’గా పిలుస్తారని వివరించారు.
ఇది కంటితో పాటు శరీరంలోని ఇతర బాగాలపైన ప్రభావితం చూపుతుందన్నారు. మ్యుకరో మైకోసిన్ కంటి చుట్టూ వుండే కణజాలాన్ని, ముక్కులోని సైనస్‌ను ప్రభావితం చేస్తుండగా ఇందుకు భిన్నంగా వైట్ ఫంగస్ కంటి లోపలి కణజాలాన్ని విట్రస్ జల్, రెటినాను ప్రభావితం చేస్తుందని చెప్పారు. రోగనిరోధక శక్తి తక్కవగా ఉన్న వారికి వైట్ ఫంగస్ చికిత్స చేపడితే కంటి చూపునకు నష్టాన్ని కలిగిస్తుందని హెచ్చరించారు. శరీరానికి మొత్తానికి ఈ వ్యాధి సంక్రమిస్తేనే ప్రాణాంతకమవుతుందన్నారు.