- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆటో పరిశ్రమలో పన్నుల భారం : మెర్సిడెస్ బెంజ్, ఆడి!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారితో పాటు అధిక పన్నుల కారణంగా దేశీయ ఆటో పరిశ్రమలోని ప్రీమియం కార్ల విభాగం వృద్ధి ప్రతికూలంగా ఉందని లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న బడ్జెట్‌లో ఆటోమొబైల్స్‌పై పన్నులను తగ్గించే నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలు అంచనా వేస్తున్నాయి. లగ్జరీ కార్లపై పన్నుల పెంపు వల్ల డిమాండ్ దెబ్బతింటున్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో గతేడాది సవాళ్ల నుంచి కోలుకోవడానికి అధిక పన్నులు సవాలుగా ఉన్నట్టు ఆయా కంపెనీల సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఆటో పరిశ్రమలోని ప్రీమియం కార్ల డిమాండ్‌ను తగ్గించే అంశాలపై దృష్టి సారించాల్సి పరిస్థితి ఉందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ మార్టిన్ ష్వెంక్ చెప్పారు. ‘ఇప్పటికే ఆటో పరిశ్రమపై అధిక పన్నులు విధించబడ్డాయి. దిగుమతి సుంకాల నుంచి జీఎస్టీ, సెస్ వరకు 22 శాతం లక్షరీ కార్లపై భారం పడుతోంది. ఈ క్రమంలో డిమాండ్ వృద్ధికి అవసరమైన పన్ను తగ్గింపును ఇవ్వడం ద్వారా ఈ రంగం వృద్ధికి తోడ్పడుతుందని’ ఆయన వివరించారు. కరోనా ప్రభావం నుంచి కోలుకుంటున్న లగ్జరీ కార్ల విభాగం ముందున్న సవాళ్లను అధిగమించాలని, అధిక పన్నులు తగ్గడం వల్ల కొంత ఉపశమనం ఉంటుందని ఆడి ఇండియా సీఈఓ బల్బీర్ సింగ్ డిలోన్ చెప్పారు.