- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూఢిల్లీ: దేశంలో తొలి బుల్లెట్ రైల్వే లైన్‌ను ముంబయి, అహ్మదాబాద్ మధ్య నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును ముంబయి అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ చేపడుతున్నది. ఇందులో భాగంగా రూ.7,000కోట్ల విలువైన సబ్ కాంట్రాక్టును దక్కించుకున్నట్టు లార్సెన్ అండ్ టౌబ్రౌ (ఎల్ అండ్ టీ) కంపెనీ గురువారం తెలిపింది. కానీ, కాంట్రాక్టు విలువ ఎంతో స్పష్టం చేయలేదు. సుమారు రూ.7వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ముంబయి, అహ్మదాబాద్ మధ్యలో 508కి.మీ. మేరకు బుల్లెట్ రైల్వే లైను చేపట్టనున్నారు. రెండు గమ్య స్థానాల మధ్య 12 స్టేషన్లు నిర్మించనున్నారు. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) నుంచి సుమారు 87.569 కి.మీ.ల రైల్వే లైన్ నిర్మాణం కోసం సబ్ కాంట్రాక్టు ఎల్‌అండ్ టీ పొందింది. ఈ కాంట్రాక్టులో భాగంగా ఒక రైల్వే స్టేషన్, వంతెనలు, నదుల భారీ బ్రిడ్జీలు, మెయింటెనెన్స్ డిపోలు, ఇతర అనుబంధ పనులను చేపట్టనున్నది.