- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.410 కోట్లతో లోయర్ మానేర్ డ్యాం అభివృద్ధి
దిశ, తెలంగాణ బ్యూరో : రూ.410 కోట్లతో లోయర్ మానేర్ డ్యాం రూపురేఖలు మారబోతున్నాయని… సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం మానేర్ రివర్ ప్రంట్ ప్రాజెక్టు పురోగతిపై జలసౌధలో టూరిజం, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో పాటు సర్వేసంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో అద్భుతమైన రివర్ ప్రంట్ గా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటుందన్నారు.
కరీంనగర్ పట్టణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే రెవెన్యూ సర్వే పూర్తయిందని ప్రభుత్వ భూముల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సర్వే ప్రతినిధులు తాము చేస్తున్న సర్వే పురోగతిని మంత్రికి వివరించారు. 1.8 కిలోమీటర్ల మేర డిజిటల్ సర్వే పూర్తయిందని, జూలై నెలాఖరుకల్లా ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ తో పాటు డీపీఆర్ ని పూర్తి చేస్తామని చెప్పారు. ఆగస్టులో రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటు ఇతర సివిల్ వర్కులకు టెండర్లు పిలిచి ఏడాది లోగా ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
బోటింగ్ కు అనుగుణంగా రివర్ ప్రంట్ రూపొందించడంతో పాటు దుబాయ్, ఓర్లాండొ, సింగపూర్ ల మాదిరిగా ప్రపంచ స్థాయి అమ్యూజ్మెంట్ పార్క్, వాటర్ స్పోర్ట్స్, లేజర్ షో, వాటర్ లైటింగ్, ఇతర ఫెసిలిటీస్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని టూరిజం అధికారులు తెలిపారు.
మానేరు రివర్ ఫ్రంటులో భాగంగా 4 కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 310.464 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేయగా, ఇవిగాకా రూ.80 కోట్లతో చెక్ డ్యాంల నిర్మాణం, రూ.190 కోట్లతో కేబుల్ బ్రిడ్జీ నిర్మాణ పనులు చివరి దశల్లో ఉన్నాయి.
సమావేశంలో ఇరిగేషన్, కాడ్ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీలు మురళీధర్ రావు, శంకర్, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావు, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, ఈఈ నాగభూషణం, ఏకాం ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.