- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రకృతి ఒడిలో ‘ప్రేమికులు’.. రా.. రమ్మంటున్న ఏజెన్సీలు
దిశ, తెలంగాణ బ్యూరో : వానాకాలం.. ఎటు చూసినా పచ్చదనమే. ఈ సీజన్ వచ్చిందంటే పర్యాటక ప్రియులు తమకు నచ్చిన ఫేవరెట్ ప్లేస్‌కు టూర్ ప్లాన్ చేసుకుని వెళ్తుంటారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో చాలా రోజుల గ్యాప్ తర్వాత పర్యాటక ప్రాంతాలు తిరిగి తెరుచుకోవడంతో రొటీన్ లైఫ్ నుంచి బయటకు వచ్చి రిలాక్స్ అయ్యేందుకు ప్రియారిటీ ఇస్తున్నారు. సిటీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు స్నేహితులు, కుటుంబసభ్యులతో లాంగ్ రైడ్లకు వెళ్తూ ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నారు. కనుచూపుమేరల్లో దట్టమైన అడవులు, భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న వాటర్ ఫాల్స్, అడ్వెంచర్ ట్రిప్స్ పర్యాటక ప్రియులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి ఒడిలో పరవశించిపోవాలనుకునే వారికి ఇవి బెస్ట్ స్పాట్లుగా మారాయి.
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాటర్ ఫాల్స్, ప్రకృతి మరింత రమణీయంగా మారుతోంది. మహానగరంలో పని ఒత్తిడి, ఉరుకులు పరుగుల జీవన విధానానికి కాస్త బ్రేక్ ఇచ్చేందుకు ప్రకృతి ప్రేమికులు మొగ్గుచూపుతున్నారు. సిటీకి 60 నుంచి 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న వాటర్ ఫాల్స్, పచ్చని ప్రదేశాలకు స్నేహితులతో సరదాగా ట్రిప్ లు వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ సమీపంలోని వాటర్ ఫాల్స్, రంగారెడ్డి జిల్లా మంచాలలోని బోడకొండ వాటర్ ఫాల్స్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులను చూసేందుకు జనం ఎక్కువగా వెళ్తున్నారు.
యాదాద్రి పుణ్యక్షేత్రంతో పాటు, ఇటీవల యునెస్కో గుర్తింపుపొందిన చరిత్రాత్మక గుడి రామప్ప, వరంగల్ వేయి స్తంభాల గుడి, లక్నవరం వంటి ప్రకృతి రమణీయ ప్రాంతాలను చూసేందుకు సిటీ నుంచి వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. లోకల్ టూరిస్ట్ స్పాట్లకే కాకుండా కొందరు పర్యాటక ప్రియులు ఇతర రాష్ట్రాల్లోని ఫేమస్ స్పాట్లకు సొంత వాహనాల్లో లాంగ్ రైడ్ చేస్తూ వెళ్లేందుకు ప్రియారిటీ ఇస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ లో బోటు షికారుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం ప్యాకేజీ కూడా అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా వైజాగ్, గోవా, కర్ణాటక, ఊటీ, చిక్ మంగుళూరు, హంపి, ఉడిపి, గోకర్న, మురుదేశ్వర్, బడామి, నాగర్ హోల్ నేషనల్ పార్క్, కాబిని వంటి ప్రాంతాలకు వారాంతపు సెలవుల్లో లాంగ్ ట్రిప్ కు ప్లాన్ చేసుకుంటున్నారు.
పర్యాటక ప్రేమికుల కోసం పలు టూరిస్ట్ ఏజెన్సీలు సైతం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. అతి తక్కువ ధరలోనే పర్యాటకుల బడ్జెట్ కు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. సంపన్న వర్గాలు మాత్రమే చేసే ఇలాంటి ట్రిప్స్ మిడిల్ క్లాస్ ఫ్యామీలీస్ కు కూడా చేరువ చేసేందుకు ఆఫర్లు ప్రకటించి ఆకర్షిస్తున్నాయి. దీంతో సిటిజన్లు టూర్లకు వెళ్లేందుకు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ట్రావెల్ ఏజెన్సీలు ట్రిప్ లో ఎక్కువగా సైక్లింగ్.. ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్ లాంటి అడ్వెంచర్ ఉండేలా చూసుకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ట్రైన్, ఫ్లైట్ లో కంటే రోడ్ రూట్లో ట్రిప్స్కే పర్యాటకులు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. యువకులు, జాబ్ హోల్డర్స్ కు ఇబ్బందులు తలెత్తకుండా వీకెండ్ లో ట్రిప్స్ ప్లాన్ చేస్తూ పలు ఏజెన్సీలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. గోకర్న రెండు రోజుల ట్రిప్ నకు రవాణా, భోజన ఖర్చులు, ఇతర ఎంట్రీల టికెట్లను సైతం కలుపుకొని ఒక్కరికి రూ.4499 చొప్పున చార్జీ చేస్తున్నాయి. అనంతరగిరి హిల్స్ రెండు రోజుల ట్రిప్ కు రూ.1999, గండికోటకు రూ.4199, రాచకొండ ఫోర్ట్ కు రూ.1299, అరకు రెండు రోజుల ట్రిప్ కు రూ.4199 చొప్పున చార్జీ చేస్తున్నాయి.
మిడిల్ క్లాస్ ప్రజలు ట్రిప్స్ చేసేందుకే..
మధ్య తరగతి ప్రజలు జీవితంలో ఎన్నో కష్టనష్టాలు భరిస్తారు. పిల్లల చదువుల కోసం అవసరమైతే వారు పొట్ట మాడ్చుకుంటారు. అలాంటి వారు సైతం ట్రిప్ లు ఎంజాయ్ చేసే రోజు రావాలి. అందుకే ఈ ట్రావెలింగ్ ఏజెన్సీ ప్రారంభించా. టూర్లకు ఎవరెవరో, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వారి భద్రత మా బాధ్యత. కొవిడ్ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తున్నాం. కొవిడ్ రిపోర్ట్ సమర్పిస్తేనే వారిని టూర్ కు అనుమతినిస్తున్నాం.
-నాగసాయి, ప్యాక్ యువర్ బ్యాగ్స్ హైదరాబాద్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు
అందరికీ అందుబాటు ధరల్లో..
ప్రపంచంలో ఉన్న ఎన్నో ప్రకృతి రమణీయ ప్రదేశాలు, అద్భుతాలు మన దేశంలోనే ఉన్నాయి. వాటిని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలకే ఆ ప్రాంతాలను చూపిస్తున్నాం. ఇప్పుడున్న పర్యాటక ప్రదేశాలు దెబ్బతినకుండా భవిష్యత్ తరాలు కూడా చూసేలా టూరిస్టులకు అవగాహన కల్పిస్తున్నాం. వృత్తిరీత్యా ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి టెన్షన్ నుంచి రిలీఫ్ అయ్యేందుకు తక్కువ ధరల్లో ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్తున్నాం. టూర్లకు వచ్చే వారు మధురానుభూతి పొందేలా అడ్వెంచర్ ట్రిప్స్ సైతం అందిస్తున్నాం.
– ప్రకాశ్, స్వదేశీ ట్రావెలర్ కమ్యూనిటీ వ్యవస్థాపకుడు