- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పనికి ఒప్పుకోలేదని లవర్ ని నడిరోడ్డుపై.. అది చూసిన చెల్లి షాక్
దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో యువతులను ప్రేమించాలని వెంటపడుతూ వేధిస్తున్న యువకులు ఎక్కువవుతున్నారు. తనను ప్రేమించాలని, పెళ్ళికి ఒప్పుకోవాలని అమ్మాయిలను వేధిస్తూ, వారి పై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా తానును దూరం పెడుతుందని ప్రియురాలిపై నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని హిమాయత్ నగర్లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కవాడిగూడకు చెందిన యువతి నారాయణగూడలోని ఓ కూరగాయల షాప్‌లో పనిచేస్తోంది. బన్సీలాల్‌పేటకు చెందిన వేణు అనే యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొద్దిరోజుల తర్వాత వేణు ప్రవర్తన నచ్చకపోవడంతో యువతి అతనిని దూరం పెట్టింది. అప్పటినుండి తన ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం కూడా మానేసింది. దీంతో ఆగ్రహించిన వేణు సోమవారం యువతి కొత్తగా పనిచేస్తున్న షాప్ వద్దకు వెళ్లి మాట్లాడాలని బయటికి పిలిచాడు. ఆమె వచ్చాక నాతో ఎందుకు మాట్లాడం మానేశావ్..? నన్ను పెళ్లిచేసుకోవా..? అంటూ యువతిని అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు.
యువతి అడ్డుకోబోవడంతో ఆమెను నడిరోడ్డుమీదనే చితకొట్టాడు. దీంతో యువతి తన చెల్లి, తండ్రికి కాల్ చేసి విషయం తెలిపింది. కొద్దిసేపటి తర్వాత చెల్లి సంఘటనా స్థలానికి వచ్చి, తన తండ్రి పోలీసులను తీసుకువస్తున్నాడని, దమ్ముంటే ఇక్కడే ఉండు అని బెదిరించడంతో వేణు పరారయ్యాడు. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న ఆ యువతి తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఇంత జరిగినా వేణు ఏమాత్రం మారలేదు. ఆ యువతికి కాల్ చేసి నోటికొచ్చిన బూతులు తిడుతూ ఇబ్బందిపెట్టాడు. ఈ వేధింపులు తట్టుకోలేని యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేణును అరెస్ట్ చేశారు.