- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘లవ్ జిహాద్’ బీజేపీ కుట్ర: రాజస్తాన్ సీఎం
జైపూర్: లవ్ జిహాద్‌కు అడ్డుకట్ట వేయడానికి చట్టాలు తీసుకొస్తామని బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రకటనలు చేస్తుండగా రాజస్తాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ అందుకు విరుద్ధంగా స్పందించారు. అలాంటి చట్టం ఏ న్యాయస్థానంలోనూ నిలువలేదని అభిప్రాయపడ్డారు. లవ్ జిహాద్ అనే పదాన్ని బీజేపీ సృష్టించిందని, దేశంలో విభజన, మత సామరస్యాన్ని దెబ్బతీయడమే దీని అసలు ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
వివాహమనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదని, దాన్ని కాలరాయాలనుకోవడం రాజ్యాంగానికి విరుద్ధమైన ఆలోచన అని వివరించారు. ఆ చట్టమూ ఏ కోర్టులోనూ నిలువదని, ప్రేమలో జిహాద్‌కు స్థానం లేదని తెలిపారు. వివాహాలకూ సర్కారు అనుమతి తీసుకునే వాతావరణాన్ని బీజేపీ సృష్టిస్తున్నదని, పెళ్లి అనేది వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నారు. ఏ రూపాల్లోనూ పౌరులపై రాజ్యం వివక్ష చూపవద్దన్న రాజ్యాంగ విలువలను అలక్ష్యం చేయజూస్తున్నదని, మత సామర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.