ప్రేమ విఫలమై యువకుడు బలన్మరణం.. జాతీయ రహదారిపై రాస్తారోకో

by Sumithra |
ప్రేమ విఫలమై యువకుడు బలన్మరణం.. జాతీయ రహదారిపై రాస్తారోకో
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని అల్లూరి సీతారామరాజు కాలనీకి చెందిన కాట్రాజు పవన్ కుమార్( 22) అనే యువకుడు పురుగుల మందు తాగి బలన్మరణం చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. మృతుడు సోమవారం రాత్రి పురుగుల మందు తాగడంతో బంధువులు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగానే మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. ప్రేమికులు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. బాధితుడి కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారి మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా బాధితుడి బంధువులు మాట్లాడుతూ… అమ్మాయి తల్లిదండ్రులు పవన్ కుమార్ కొట్టారని, మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు అవమానానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పవన్ కుమార్ మృతికి కారకులైన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అమ్రాబాద్ సీఐ పోచయ్య ఆందోళనకారుల వద్దకు చేరుకొని జరిగిన విషయాన్ని బంధువుల ద్వారా తెలుసుకున్నారు. మృతుడి సోదరి శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని బంధువులకు హామీ ఇవ్వడంతో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోతో అరగంటసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది.

Advertisement

Next Story

Most Viewed