పెద్దగట్టు ఆలయంలో అపశృతి.. ఆందోళనలో భక్తులు

by Shyam |   ( Updated:2021-02-27 10:17:44.0  )
పెద్దగట్టు ఆలయంలో అపశృతి.. ఆందోళనలో భక్తులు
X

దిశ, సూర్యాపేట : పెద్దగట్టు జాతర ప్రారంభానికి ముందు దేవస్థానం వద్ద శనివారం అపశృతి చోటు చేసుకుంది. దూరాజ్పల్లి లోని శ్రీ లింగమంతుల స్వామి దేవాలయానికి తూర్పు భాగంలో ఉన్న ధ్వజ స్తంభాన్ని చెరుకు లారీ శనివారం ఢీ కొట్టడంతో ముక్కలైంది. ధ్వజ స్తంభానికి పూజలు చేసిన తరువాతే జాతర నిర్వహించడం ఆనవాయితీ. నేటి నుంచి జాతర ప్రారంభం కానుండటంతో భక్తులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. అయితే కూలిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో మంత్రి జగదీశ్ రెడ్డి వెంటనే స్పందించారు. అధికారులతో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

తక్షణం ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపచేయిలని అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డిని ఆదేశించారు. అప్పటికప్పుడు రంగంలోకి దిగిన అధికారులు శాస్త్రబద్ధంగా ధ్వజస్తంభ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed