లారీ, బ్రెజ్జా కారు ఢీ.. ఇద్దరు డ్రైవర్లు జంప్..? వాహన తనిఖీల్లో షాకైన పోలీసులు

by Sumithra |   ( Updated:2021-11-01 05:52:54.0  )
లారీ, బ్రెజ్జా కారు ఢీ.. ఇద్దరు డ్రైవర్లు జంప్..? వాహన తనిఖీల్లో షాకైన పోలీసులు
X

దిశ, సదాశివనగర్ : సాధారణంగా లారీ డ్రైవర్లు ఎక్కువగా యాక్సిడెంట్లు చేస్తుంటారు. దానికి అనేక కారణాలు ఉంటాయి. నాన్‌స్టాప్‌గా డ్రైవింగ్ చేయడం, నిద్రలేకపోవడం, బ్రేకులు పడకపోవడం, హెవీలోడ్ వెహికిల్స్ కంట్రోల్ కాకపోవడంతో క్షణాల్లో పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రమాదం చేసిన వాహనం డ్రైవర్లు ఎక్కడ తమను అరెస్టు చేస్తారనో, స్థానికులు పట్టుకుని దాడి చేస్తారనో పారిపోతుంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ప్రమాదం చేసిన డ్రైవర్‌తో పాటు ప్రమాదానికి గురైన వాహనం డ్రైవర్ కూడా తన కారును అక్కడే వదిలేసి జంప్ అయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ట్రాన్స్‌పోర్టు లారీ.. ఏపీ 09 హెచ్‌హెచ్ 2986, టీఎస్ 09 ఎఫ్ క్యూ 9349 గల మారుతి బ్రెజ్జా కారును సదాశివనగర్ సమీపంలో ఆదివారం రాత్రి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోగా, రెండు వాహనాల డ్రైవర్లు పారిపోయారు.. లారీని పోలీసులు తనిఖీలు చేయగా అందులో 62 కోడె దూడలు కనిపించాయి. వీటిని గోషాలకు తరలిస్తున్నట్టు ఎస్ఐ శేఖర్ తెలిపారు. అయితే, లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పారిపోయాడనుకుంటే, కారు డ్రైవర్ ఎందుకు వాహనాన్ని వదిలేసి వెళ్లిపోయాడని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement

Next Story

Most Viewed