బొలెరో ఢీకొని డ్రైవర్ మృతి

by Sumithra |
బొలెరో ఢీకొని డ్రైవర్ మృతి
X

దిశ, పటాన్‌చెరు:
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన మారుతి (40) సహా డ్రైవర్ బలరాం కమలతో కలిసి హైదరాబాద్ నుంచి మంగళవారం రాత్రి పట్టణంలోని అమెజాన్ గోదాంకు లోడు తీసుకొచ్చారు.

బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో మారుతి చాయ్ తాగేందుకు జాతీయ రహదారిపై నుంచి పటాన్‌చెరు వైపు వస్తుండగా సంగారెడ్డి వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో మారుతి అక్కడికక్కడే మృతి చెందాడు. సహా డ్రైవర్ బలరాం కమల ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామ్ నాయుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story