ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం..

by Sumithra |
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం..
X

దిశ, రాజేంద్రనగర్ : లారీ కంటైనర్ లో మంటలు చెలరేగడంతో క్యాబిన్ లో ఉన్న డ్రైవర్, క్లీనర్ లు సజీవ దహనమైన ఘటన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏసి కంటెనర్ లో ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ నుండి రోయ్యల లోడుతో వస్తున్న భారీ కంటైనర్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్ సాగర్ వద్దకు రాగానే మరో లారీని ఢీ కొట్టి ప్రమాదానికి గురైంది. మంటలు చెలరేగడంతో లారీ క్యాబిన్ లో ఉన్న సూరజ్ (45), మూర్తునుజన్ (40) అనే డ్రైవర్, క్లీనర్ లు సజీవ దహనమయ్యారు. మృతులను ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేసే లోపే రెండు ప్రాణాలతో పాటు కంటైనర్ అగ్నికి అహుతి అయింది.

Advertisement

Next Story