- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాంటెడ్ డాగ్ వాకర్.. జీతం 2 లక్షల పైనే!
దిశ, వెబ్‌డెస్క్ : అసలే కరోనా కాలం.. ఈ సమయంలో ఉద్యోగాలు దొరకడమే గగనం. ఒకవేళ దొరికినా, జాబ్ ఆఫర్ చేసే కంపెనీలు శాలరీల్లో భారీగా కోత విధించడంతో పాటు ప్యాకేజ్‌లు అంతంతమాత్రంగానే ఇస్తున్నాయి. దీంతో వచ్చిన దాంతోనే సర్దుకుపోతున్నారు ఉద్యోగులు. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్‌లో నెలకు రెండు లక్షలకుపైగా శాలరీ ఆఫర్ వస్తే.. అది కూడా డిగ్రీ పట్టాలు అవసరం లేకుండానే వస్తే? ఎగిరి గంతేస్తారు కదా. కానీ ఇది వైట్ కాలర్ ఉద్యోగం లేక సాఫ్ట్‌వేర్ జాబ్ కానేకాదు. ‘డాగ్ వాకర్’.. శునకాన్ని వాకింగ్ తీసుకెళ్లే ఉద్యోగం. లండన్‌లో వచ్చిన ఈ ప్రకటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.
లండన్‌కు చెందిన లిటిగేషన్ స్పెషలిస్ట్ జోసఫ్ హేజ్ అరోన్‌సన్.. హల్‌బార్న్‌లో నివసిస్తుంటాడు. ఆయన ఇటీవలే ‘ప్రైవేట్ అసిస్టెంట్ అండ్ డాగ్ వాకర్’ కావాలని ప్రకటన ఇచ్చాడు. తన పెంపుడు కుక్కను ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు తీసుకెళ్లడం ఆ ఉద్యోగి ప్రధాన బాధ్యత. అయితే ఇందుకు డిగ్రీ పట్టాలు అవసరం లేకపోయినా కొన్ని కండిషన్స్ మాత్రం ఉన్నాయి. అవేంటంటే.. ఈ ఉద్యోగానికి కుక్కలను ప్రేమించేవారు మాత్రమే అర్హులు. అంతేకాదు అంతకుముందు డాగ్ హ్యాండ్లింగ్, వాకింగ్ తీసుకెళ్లిన అనుభవం ఉండాలి. ఏ వాతావరణంలోనైనా చాలా క్విక్‌గా పనిచేయగలగాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీ. వీకెండ్ హాలీడే ఇస్తారు. ఇక ఈ ఉద్యోగానికి ఏడాదికి 30 వేల పౌండ్లను (దాదాపు 29 లక్షల రూపాయలు, నెలకు రెండు లక్షలపైనే) జీతంగా ఇస్తామని ప్రకటనలో పేర్కొన్నాడు. అంతేకాదు.. పింఛన్, జీవిత బీమాతో పాటు ప్రైవేట్ హెల్త్, డెంటల్ ఇన్సూరెన్స్ సదుపాయాలు కూడా ఉంటాయని పేర్కొంది. కుక్క వెంట పరుగెత్తడానికి కాస్త ఫిట్‌నెస్ కూడా ఉండాలని ప్రకటనలో పేర్కొనడం విశేషం.